దారుణం: కర్రతో కొట్టి వియ్యంకుడి హత్య

 కమ్మర్‌పల్లి(నిజామాబాద్‌) : కూతురిని పుట్టింటికి పంపించనందుకు వియ్యంకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేటకు చెందిన బోదాసు రాజెం కమ్మర్‌పల్లి హాసాకొత్తూర్‌లోని మారుతినగర్‌లో నివాసముండే తన కూతురు ఇరుగదిండ్ల నీలా ఇంటికి శనివారం వెళ్లాడు. తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్తానని వియ్యంకుడు ఇరగదిండ్ల రాములు(45), వియ్యంకురాలు రేణుకను కోరాడు. కొడుకు ఇంట్లో లేడని, వచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పారు. (ఆ గ్రీన్‌జోన్‌లో 21 మందికి కరోనా పాజిటివ్‌! )